రెవెన్యూ ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్ ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులందరూ ప్రజలకు సేవలందించడంలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. బాధ్యతాయుత దృక్పథంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం, సేవల నాణ్యత, పరిపాలనలో సమర్థత కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె గౌతమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షులు పి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు కె నిరంజన్‌రావు, ఆర్ మనోహర్ చక్రవర్తి, కార్యదర్శులు డి వాణి, జాయింట్ సెక్రెటరీలు బి రాములు, మహమ్మద్ షఫీయుద్దీన్, ఎం రాజేశ్వర్‌రెడ్డి, నజీమ్ఖాన్తోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును వారు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి విక్టర్, ప్రధాన కార్యదర్శి కె చంద్రకళ, కోశాధికారి చొల్లేటి వెంకటేశ్వర్లు, అసోసియేషట్ అధ్యక్షులు కె ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



