డిటిఎఫ్ మండల అధ్యక్షుడు రాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు రాజు తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు జలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఈఓ రాందాస్ చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు, పిఆర్సి ఇవ్వకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పటికే 6 డిఏ లు పెండింగ్లో ఉన్నాయని, పిఆర్సి పెండింగ్లో ఉందని, వెంటనే పి ఆర్ సి నివేదిక తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జనరల్ సెక్రెటరీ సుధాకర్, జిల్లా కౌన్సిలర్ యాదగిరి ,సభ్యులు రామస్వామి బుచ్చి రామయ్య వినయ్ కుమార్ రాగి రమేష్ దామెర రమేష్ ఉపేందర్ వెంకటయ్య, స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ నెల్లికుదురు హై స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
పెండింగ్ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



