Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల కడుపుకొట్టేలా కేంద్ర విధానాలు

పేదల కడుపుకొట్టేలా కేంద్ర విధానాలు

- Advertisement -

‘ఉపాధి’ని నీరుగార్చేందుకే వీబీ జీ రామ్‌ జీ : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ

పేదల కడుపుకొట్టేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, వాటిని ఉద్యమాలతో తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఆయా పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని తీసుకొచ్చిందని విమ ర్శించారు. మహత్మాగాంధీ పేరును తొలగించడం తో పాటు ఉపాధిహామీ చట్టానికి నిధులు తక్కువ చేసి పేదలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపుగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకోవాలన్నారు. విద్యుత్‌రంగంలో తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రయివేట్‌పరం చేసి పేదలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉత్పత్తిరంగంలో కీలకంగా ఉండే కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తూట్లు పొడిచేంఙ దుకు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని చెప్పారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోంద న్నారు. లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసం ఘాలు, కార్మికులు, రైతులు వ్యవసాయకూలీలు పెద్దఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపుని చ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, సైన్స్‌ విజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మువ్వా రామారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డాక్టర్‌ జె.రాజు, ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య, డాక్టర్‌ మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, అంజయ్య, చాంద్‌పాషా, సీతారాములు, తిరుపతి రామ్మూర్తి, కోడిరెక్క మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -