Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ

- Advertisement -

– ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌ఏ స్టాలిన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యారంగాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌.ఎ.స్టాలిన్‌ విమర్శించారు. శుక్రవారం హిమాయత్‌ నగర్‌లోని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. స్టాలిన్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లో వికసిత్‌ భారత్‌ శిక్షా అధిషా’న్‌ (వీబీఎస్‌ఏ) బిల్లు తీసుకురావడం సిగ్గుచేటు అని విమర్శించారు. జాతీయ నూతన విద్యా విధానం, వీబీఎస్‌ఏ బిల్లు రద్దు కోసం విద్యార్థులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌ షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌కు సంబంధించిన రూ.9,300 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -