రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తమ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి దర్శకుడిని అనౌన్స్ చేసింది. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబి నేషన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారు. ఇది రజనీకాంత్ నటిస్తున్న 173వ చిత్రం. ఇది నెక్స్ట్ లెవల్ సినిమాటిక్ గ్రాండియర్‌గా ఉండనుంది అని మేకర్స్ తెలిపారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లెగసీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనుంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్‌తో ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. త్వరలోనే తారాగణం, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలను రివీల్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా 2027 పొంగల్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ స్టార్ పవర్, ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం పర్‌ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుంది అని చిత్రయూనిట్ తెలిపింది.
సిబి చక్రవర్తి దర్శకత్వంలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



