బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రామమ్’. శనివారం హీరో సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. ది రైజ్ ఆఫ్ అకిరా ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడోతో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ – సాహి సురేష్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, డీవోపీ – జ్ఞానశేఖర్ వీఎస్, డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా, మ్యూజిక్ – ఎం ఎబినెజర్ పాల్, నిర్మాత – వేణు దోనేపూడి, రచన, దర్శకత్వం – లోకమాన్య.
భిన్న కథతో ‘రామమ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



