‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ ఇప్పుడు మైథలాజికల్ జోనర్‌లో రూపొందుతున్న ‘త్రికాల’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా ‘యాలో ఈ గుబులే..’ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ తన స్టైల్‌తో పాటు మెలోడీకి ఉన్న డెప్త్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.
ఇక అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది. భావోద్వేగాల్ని సూటిగా హృదయానికి చేరేలా చెప్పగల ఆయన వాయిస్ పాటలోని లవ్ ఫీలింగ్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. రాకేందు మౌళి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేలా ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది అని చిత్రయూనిట్ తెలిపింది. రిత్విక్ వేట్షా సమర్పణలో శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ఈ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ చేసిన ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ బిజినెస్ జరిగిపోయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘త్రికాల’ విడుదలకు సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



