Thursday, January 8, 2026
E-PAPER
Homeక్రైమ్రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. పెయిడ్-పార్కింగ్ షెడ్‌లో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ విద్యుత్తు తీగ బైక్‌లపై తెగిపడడంతో నిప్పు రవ్వలు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో 400 వరకు ద్విచక్ర వాహనాలు అక్కడ ఉన్నాయని.. వాటిలో చాలావరకు కాలిపోయాయని తెలిపారు. వాహనాలతో పాటు టిన్ షీట్‌ల షెడ్ మంటల్లో దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Two-wheelers gutted in fire

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -