Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యయత్నం..

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యయత్నం..

- Advertisement -

దేవక్కపల్లిలో ఘటన
– చికిత్సకు తరలిస్తుండగా మార్గమద్యలో మృతి
నవతెలంగాణ – బెజ్జంకి
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సోరుపాక అమర్(22) ఎలక్ట్రిషయన్ పనిలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వచ్చే చూసే సరికి యువకుడు ఉరేసుకుని ఉండడంతో తొలగించి చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు. పోలీసులు యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. యువకుడి మృతిపై పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -