Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

- Advertisement -

ప్రాణాలు కాపాడిన కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ అంబులెన్స్ సేవలు….
నవతెలంగాణ-గన్నేరువరం
మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన బొజ్జ రాజయ్య ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు లోయర్ మానేరు డ్యామ్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హనుమాజిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలతో ఉన్న వ్యక్తిని గమనించి కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ అంబులెన్స్ సర్వీస్ కు సమాచారం అందించడంతో అంబులెన్స్ సర్వీస్ హుటాహుటిన అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో సమయానికి వైద్య సహాయం అంది అతనికి ప్రాణాపాయం తప్పింది. మండలంలో కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న అంబులెన్స్ సర్వీస్ సేవలను బాధిత కుటుంబ సభ్యులు మండల ప్రజలు అభినందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -