నవతెలంగాణ-బంజారా హిల్స్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ముందుకు రావాలని ఏఐబిఎస్పి సమన్వయకర్త పూర్వచంద్రరావు పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని గంగిరెద్దుల సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో బీసీ ఇంటాలెచ్వల్ పోరం వ్యవస్థపాకులు మాజి ఐఏఎస్ చిరంజీవులు,సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బీసీ సంఘ నాయకులు ఆయన మాట్లాడుతూ.. తక్కువ సంఖ్య ఉన్నామని ఉన్నత భావాన్ని వదిలేసి అన్ని రంగాల్లో ముందుకు వచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రస్తుతం రాజకీయపరంగా తక్కువ సంఖ్య గల సామాజిక వర్గాలే ముందు వరుసలో ఉన్నాయని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు.
గంగిరెద్దుల వాళ్లు రాజకీయాల్లో ముందుకు రావాలి: పూర్వచంద్రరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



