నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచి భద్రతా చైతన్యం కల్పించేందుకు రోడ్డు భద్రతా, సైబర్ అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం సీఐ సంతోష్ ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు అధిక వేగం, త్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా లేదా ఆన్లైన్ లావాదేవీల సమయంలో అపరిచిత లింకులు ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడాలని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ తిరుపతి, ఏఎస్‌ఐ రవీంద్ర చారి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ సంతోష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



