Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
విద్యార్థులంతా 25 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి సందడి చేశారు. ఆదివారం ఆలేరు మండలం శారాజీపేటలోని భువన వెంచర్స్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మల్లారెడ్డి,రాములు,రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పూర్వ విద్యార్థులు చిలుకు స్వామి, శ్రీధర్, మహేందర్,చిలుకు నాగరాజు, నరసింహస్వామి, దూడల వెంకటేష్, కిరణ్,భువనేశ్వరి తదితరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -