Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు నీళ్ల నిజాలు తెలియాలని అసెంబ్లీలో చర్చ 

ప్రజలకు నీళ్ల నిజాలు తెలియాలని అసెంబ్లీలో చర్చ 

- Advertisement -

మీడియాతో మాట్లాడి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు 
కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ 
నవతెలంగాణ – ఆలేరు

ప్రజలకు కృష్ణా నది జలాలు ప్రాజెక్టు లా విషయంపై అసెంబ్లీలో చర్చ పెడితే కెసిఆర్ చర్చలో పాల్గొనకుండా నిజాలు బయటికి వస్తాయని భయంతో గైర్హాజర్ అయ్యారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. నవతెలంగాణతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కృష్ణ నది నీళ్లపై మీడియా సమావేశంలో అవాకులు చవాకులు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెడితే గైరాజరవడం చర్చల్లో పాల్గొంటే నిజాలు బయటపడి దొంగతనం ప్రజలకు తెలుస్తుందని రాలేదన్నారు. ఆ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీ రామారావు మాజీమంత్రి హరీష్ రావు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని పోయి బయట మీడియా పాయింటు వద్ద తామేదో గొప్ప చేసినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్య చర్చించడానికి అసెంబ్లీలో నీళ్లపై జరుగుతున్న సందర్భంలో చర్చలో పాల్గొనకుండా బయట మీడియాతో మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టికెందుకే అన్నారు. పార్టీ మొత్తాన్ని బావ బామ్మర్దుల గుప్పిట్లో తెచ్చుకునేందుకే కేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరి తో పాటు కె.సి.ఆర్.ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుతున్నారని అసత్య ప్రచారాలు సానుభూతి పొందే ప్రయత్నం బావ బామ్మర్ది కి తగదు అన్నారు.

కె సి ఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి పరామర్శించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న విషయం అసెంబ్లీ మొదటి రోజు సమావేశం రోజు కె సి ఆర్ సీటు వద్దకు వెళ్లి  మందలించి ఆరోగ్యం గురించి తెలుసుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. బి ఆర్ ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియమాకాలను తుంగలోతొక్కారని అందుకే ప్రజలు అధికారానికి దూరం చేశారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి వాటర్ సోర్స్ పాయింట్లు జూరాల నుండి శ్రీశైలం కు ఎందుకు మార్చారు సభలో సమాధానం చెప్పాలన్నారు. తమకు అడ్డు వస్తుందని కేటీఆర్ హరీష్ రావు కవితను  పార్టీ నుండి సాగనంపారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభలో కొచ్చి నీళ్లపై నిజాలు ప్రజలకు చెప్పాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -