సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్
గ్రామాల్లో సీపీఐ(ఎం) జనాభిప్రాయ సేకరణ
నవతెలంగాణ – వనపర్తి
గొల్లపల్లి డాష్ చెరిక పల్లి రిజర్వాయర్ ను నూటికి 90 శాతం మహిళ మెజార్టీ ప్రజల అభిప్రాయం సేకరించి ప్రభుత్వ నిర్ణయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ బృందం ఏదుల మండలం గొల్లపల్లి- చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్న క్రమంలో మూడు గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణకు ఆదివారం శ్రీకరం చుట్టుంది. గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధుల అభిప్రాయం తెలుసుకోవడానికి సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా బృందం చీర్కపల్లి, గొల్లపల్లి, చెన్నారం, ఏదుల రిజర్వాయర్ ప్రాంతాలను పరిశీలించింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ కు లింకుగా చీర్కపల్లి -గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మూడు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి నూటికి 90 శాతం జనాభా అభిప్రాయం సేకరించి 90 శాతం మెజార్టీ ప్రజల అభిప్రాయం పరిగణనలోకి తీసుకొని రిజర్వాయర్ నిర్మాణం అంశంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఉంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వాయర్ నిర్మాణం పై నిర్ణయం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి బాల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వర చారి, నాయకులు మండ్ల బాలస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



