Wednesday, January 7, 2026
E-PAPER
Homeదర్వాజహనన క్రీడ

హనన క్రీడ

- Advertisement -

నడి బజార్లో నాగరికత నగ రూపం
మనిషి మగమైన మూకస్వామ్యం
ఉన్మాద ఉగ్ర జ్వాలల్లో కాలిపోతున్న దేహాలు.. దేశాలు
నిన్నటిదాకా తమ మధ్యే బ్రతికిన మనిషి
నేడు కొత్తగా మతం వాసన వేశాడు
బెదిరిపోతున్న కన్నుల జింక పిల్లలా
హడలి పోయిన ఏకాకిపై వేలాది హైనాల హనన క్రీడ
ఎవడో ఎగదోస్తున్న మంటల్లో
మాడి మసిబొగ్గైన మానవత్వం
అగ్నిజ్వాలలకు ఆజ్యం పోస్తూ చూస్తున్న
నోబుల్‌ శాంతి బహుమానం
స్వేచ్ఛను కానుకిచ్చిన కథను మరిచి
ద్వేష సర్పమై బుసలు కొడుతున్న దేశం
భూభాగాలను వేరుచేసి గీసిన బలుపు చిత్రాలు
ఏడు అంగాలను తెగ నరుకుతామన్న
కండకావరపు కారుకూతలు
నాడు ఉనికి కోసం దేబరించిన పిల్లికూనే
నేడు కయ్యానికి కాలు దువ్వుతున్న కాగితప్పులి
అంతగా యుద్ధానికై తహతహలాడితే
మీ దేశంపై కప్పేందుకు
సరిపోయే కఫన్లు కూడా దొరకవు
భౌగోళిక సరిహద్దులు, బహుళ సంస్కతులు
భిన్న భాషలు.. మతాలు
పుడమిని అలంకరించే అందమైన ఆభరణాలు కావాలి
రాజకీయ విష క్రీడలో
దేహం పై మొలచిన రాచపుండులవుతే
దేశాలన్నీ నిత్యం రగిలే రావణ కష్టాలే

  • గాజోజు నాగభూషణం, 9885462052
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -