మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు-సమాలోచనం
తెలుగుశాఖ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం కోఠి, హైదరాబాద్ కేంద్రంగా మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు-సమాలోచనం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ నెల 6,7 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. సూర్యాధనంజయ్, డా.యోగితారణా ఐ.ఎ.ఎస్. ఎ.దేవసేన, ప్రొ|| కాత్యాయని విద్మహే, ప్రొ|| సి.మణాళిని డా.గోగు శ్యామల, జూపాక సుభద్ర, అపర్ణ తోట, ప్రొ. జి.వి.రత్నాకర్, ప్రొ. గంపా వెంకట రామయ్య, ప్రొ. జె. వెంకట రమణ, ప్రొ. ఎన్. రజనీ, ప్రొ. కె.లావణ్య, ప్రొ. వారిజారాణి, ప్రొ. వి.త్రివేణి, ప్రొ. కిన్నెర శ్రీదేవి, ప్రొ. ఆర్ రాజేశ్వరమ్మ, డా.సంగిశెట్టి శ్రీనివాస్, డా.ఎన్. సంధ్యారాణి, గార్లపాటి పల్లవి, మెర్సీ మార్గరేట్, మానస ఎండ్లూరి, సి.వనజ, డా.కొండపల్లి నిహారిణి, డి. జ్వలిత, పి.జ్యోతి, డా.బి.మనోహరి, అయినంపూడి శ్రీలక్ష్మి, డా.జె.నీరజ, డా.ఎ.సుజాత, డా.వింధ్యావాసినీదేవి, డా. కె.డి.డి. మణాళిని, తదితరులు పాల్గొంటారు. కన్వీనర్: డా.ఎస్.రఘు
సాంస్కతిక విప్లవకారుడు బసవేశ్వరుడి జీవితంపై కవితలకు ఆహ్వనం
12వ శతాబ్దానికి చెందిన బసవణ (బసవేశ్వరుడు) ఆలోచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆయనను ‘క్రాంతియోగి’గా, సాంస్కృతిక విప్లవకారుడిగా వ్యక్తపరిచే కవితలను ఆహ్వానిస్తున్నాము. ఎంపికైన కవితలతో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో కవితా సంకలనం వస్తుంది. 30 వరసలకు మించని కవితతో పాటు, ఫొటో, మీ చిరునామాను జనవరి 15లోపు పంపాలి. చిరునామా: కెంగార మోహన్, ఇ.నెం.43-238. ఫ్లాట్ నెం.102, ఎన్వీఆర్ ప్లాజా, ఎన్‌ఆర్ పేట, రోడ్ నెం.8, కర్నూలు-518003. వివరాలకు : 9493375447.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


