ఏకాదశి నుండి సంక్రాంతి వరకు
ఏ పండుగ పని మనిషి ఇంటికి రావడం లేదు
అమ్మ మొదట పెట్టిన కఠిన షరతు
పండుగ పూట పని మానేయకూడదు అని
ప్రతి పండుగకు పొద్దుగాక ముందే
ఇల్లు అంతా సముద్రం చేసి ఆవిరి కూడ చేయాలి
ఇంటి ముందు ముగ్గు పని మనిషి కళా ఖండమే
ఆమె చెమట చుక్కల తోనే ఇంటి తోరణం
మొక్కలకు మొక్కులకు పాదు ఆమె
సాయంత్రం వచ్చి సకినాలకు సాయం కావలసినదే
అమ్మకు పని మనిషి మూడో చేయి ఎల్లప్పుడూ
భూమి సూర్యుని చుట్టూ తిరిగి నట్లు
పని మనిషి మా ఇంటి చుట్లు పదే పదే
అమ్మ పిలుపు కు అంత అయస్కాంత శక్తి వుంది
ఆల కించ కుంటే అమ్మ శివ గామీయే సుమీ
కత్తి రింపులు జీతం కోతలు ఆమె మెడ మీద
పని మనిషి ఇంటికి పండుగ రాలేదు
తీపి సంగతి దేవుడు ఎరుగు
పండుగ పూట పిల్లలతో గడపడం అత్యాశనే
తెల్ల వారక ముందే బరువుగా ఇళ్ల చుట్టూ …
- దాసరి మోహన్, 9985309080


