- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సమయస్ఫూర్తితో టేకాఫ్‌ను నిలిపివేయడంతో 137 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సిలిగురికి వెళ్లాల్సిన విమానంలో లోపాన్ని ఇంజనీరింగ్ సిబ్బంది సరిచేస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
- Advertisement -



