నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన తుడుం రాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి సమాజ సేవకుడు తుప్పరి కరుణాకర్ ఆర్థిక చేయూత అందించారు. సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్, రాజు కుటుంబానికి ఒక క్వింటా బియ్యం, రెండు నెలలకు సరిపడే కిరాణా సరుకులను అందజేశారు. కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలోని ప్రతి ఒక్కరూ సహాయహస్తం చాపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సురేష్, అన్నం నాగరాజు, జిల్లపెళ్లి నరేష్, పరమాండ్ల రాజేష్, నవీండ్ల రాజ్ కుమార్, బత్తిని రాజశేఖర్, నర్మెట రాజు, తుడుం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



