- Advertisement -
మాజీ ఎమ్మెల్యే పుట్ట సమక్షంలో బిఆర్ఎస్ చేరికలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మార్కెట్ మాజీ డైరెక్టర్ బోయిని రాజయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన సొంతగుటిలోకి వెళ్లారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజయ్య తోపాటు యాదండ్ల విక్రం యాదవ్,గొర్రె మల్లయ్య యాదవ్,ఇట్టవేల కొమురయ్య యాదవ్,కుంభం శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీలో చేశారు. గులాబీ కండువాలు కప్పి పుట్ట సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత స్తానం ఇవ్వకపోవడంతోనే మళ్ళీ గులాబీ గూటికి వెళ్లినట్లుగా రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



