Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా మహిళా సాధికారతపై అవగాహన

జిల్లా మహిళా సాధికారతపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని బొల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రం నందు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కారక్రమ్యం నీ ఉద్దేశించి జెండర్ స్పెషలిస్ట్ స్రవంతి  మాట్లాడుతూ ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ యొక్క సేవలు, మహిళా హక్కులు, పథకాలు వాటి వినియోగం, లింగ నిర్ధారణ చట్టం, పరిసరాల పరిశుభ్రత గురించి, మదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఉన్నత విద్య, బాల్య వివాహ నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేసుకున్నందుకు వాటి వల్ల కలిగే మానసిక శారీరక ఆర్థిక అనర్థాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కల్పన  , భరోసా సెంటర్ స్వర్ణలత ,ఆశా కార్యకర్త స్వాతి ,గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు గ్రామ ప్రజలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -