Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
వెనుజుల దేశ రాజధాని కరకాసుపై అమెరికా బాంబులతో దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంపు దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంపు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచము తన పెత్తనం కోసం చికుక పలుకులు పలుకుతూ మరో దిక్కు ప్రకృతి, ఖనిజ, సహజ వనరులు, ఉన్న దేశాలపై తన పట్టును పెంచుకోవడం కోసం నీచమైన పద్ధతులను అవలంబిస్తుందని ఆయన తెలిపారు.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో డ్రగ్స్ ను అమెరికాకు పంపుతున్నాడని, కేసులు బనాయించి, వెనిజులా దేశం పై ఏకపక్షంగా దాడి చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. వెనిజులా దేశానికి చావేజ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చమురు ఉత్పత్తి కంపెనీలను తమదినంలో వుండాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. వెనుజులలో ఉన్న చమురు ఉత్పత్తులను అమెరికా దోచుకోవడానికి సహకరిచించడం లేదని కావాలనే ట్రంప్ వెనుజుల దేశం పై దాడులు చేస్తున్నారు అని అన్నారు. అమెరికా సామ్రాజ్యం ప్రపంచం లో ఉన్న చమురును తన అధీనంలో పెట్టుకోవాలని వినకుంటే దాడులకు పలు పడలని చూస్తున్నాడు అని అన్నారు. ఈ దుర్మగపు చర్యలను అందరూ ఖండించాలని అన్నారు.

 అమెరికా “ట్రంప్ మాటల్లో ప్రజాస్వామ్య వచనాలు, ఆచరణలో అక్రమ దాడులు” అనే విషయం మరోసారి నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదనుఅక్రమంగా దారి మళ్లించాడానికి దిగజారుడు చర్యలను మానుకోవాలన్నారు. ఎకనామిక్ హిట్ మాన్ అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ సంస్థల పని చేసిన జాన్ పెర్సెన్స్ ఒక దళారి అన్నారు. నిలకొలస్ మధురోను, అతని భార్యను వెంటెనే వదులలని అన్నారు. ట్రంప్ దుశ్చర్యలను ప్రపంచ దేశాలు ఖండిచలని ట్రంప్ పై ఒత్తిడి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) నాయకులు బి రవి, ఓంకార్, సాయిలు, కుమార్, సాయన్న, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -