Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలునంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా, డోన్‌ సమీపంలోని ఉడుములపాడు వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒకే బైక్ పై సొంత గ్రామం నుంచి విధులకు బయలుదేరారు. రహదారిపై మంచు కారణంగా ఎదురుగా వస్తున్న ఎండ్లబండి కనిపించకపోవడంతో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె. సురేంద్ర (26) అక్కడికక్కడే మృతి చెందగా, రాజశేఖర్‌ (24) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మరో గార్డు వై. సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -