నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్ (SIR) సర్వేతో ఓట్ల సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కలకత్తాలో భారీ మొత్తంలో ఓట్లను తొలగించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రచురించింది. మొత్తం 15.44 కోట్ల ఓటర్లలో 12.55 కోట్ల (81.30 శాతం)మంది ఓటర్ల పేర్లు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 2.17 కోట్ల మంది శాశ్వతంగా వేరేచోటికి షిఫ్ట్ అయ్యారు. 46.25 లక్షల మంది మరణించారు. డూప్లికేట్ ఐడీ కార్టులు, జాడ తెలియకుండా పోయిన కారణాలతో 24.47 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాలో చోటుచేసుకోలేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి నవదీప్ రిన్వా తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితోలో పేర్లు లేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో కానీ, బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఏ)ను సంప్రదించి కానీ ఫిబ్రవరి 6వ తేదీలోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని రిన్వా చెప్పారు



