Friday, January 9, 2026
E-PAPER
Homeహైదరాబాద్వారసత్వ శాఖతో ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన ఒప్పందం

వారసత్వ శాఖతో ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన ఒప్పందం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ వారసత్వ శాఖ (Department of Heritage) మధ్య అవగాహన ఒప్పందం (MoU) విజయవంతంగా కుదిరింది. ఈ ఒప్పందంపై వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. ప్రభు సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థుల్లో వారసత్వ సంరక్షణపై అవగాహన పెంపొందించడం, చరిత్ర-సంస్కృతి అధ్యయనాలకు ప్రోత్సాహం ఇవ్వడం, శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ఫీల్డ్ స్టడీస్ నిర్వహించడం వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించనున్నారు.

ఈ ఒప్పందం విద్యార్థులకు అకడమిక్, ప్రాక్టికల్ జ్ఞానం పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాల్గొన్న అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డా.పి.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్ పాల్గొన్నారు. కళాశాల తరఫున చరిత్ర విభాగాధిపతి డా.బీరయ్య, అధ్యాపకులు డా.సి.హెచ్.కవిత, డా. డి. సాయిలు, సూపరింటెండెంట్ రాజు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -