Friday, January 9, 2026
E-PAPER
Homeక్రైమ్అంతర్ జిల్లా సర్వీస్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా సర్వీస్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
  • – చాకచక్యంగా కేస్ చేదించిన ప్రత్యేక బృందం
    – నిందితులు రిమాండ్ కు తరలింపు 
  • – గజ్వేల్ ఏసిపి నర్సింలు
  • నవతెలంగాణ – రాయపోల్
  • గత సంవత్సర కాలం నుంచి రహదారులకు పక్కన ఉన్న వ్యవసాయ పొలాలలోని బోరు బావుల వద్ద సర్వీస్ కేబుల్ వైర్లను దొంగలించి, వాటిలో నుంచి కాపర్ వైర్లను తీసి విక్రయిస్తూ జల్సాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొగుట సిఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ కుంచం మానస ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేయడం జరిగిందని గజ్వేల్ ఏసిపి నర్సింలు తెలిపారు. మంగళవారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో నిందితులను హాజరపరిచి దొంగలించిన వస్తువులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సర కాలంగా సిద్దిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాలో రహదారులకు పక్కన ఉన్న వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకొని కేబుల్ సర్వీస్ వైర్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల రాయపోల్ పోలీసులు వడ్డేపల్లి గుర్రాలసోప వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టగా మరో దొంగతనానికి వెళ్తున్న ఐదుగురు అనుమానితులు పోలీసులను చూసి పారిపోయారు.
  • ఈ వరుస దొంగతనాలు సిద్దిపేట జిల్లాలోని కుకునూర్ పల్లి (04), రాయపోల్ (04), తొగుట (2), మెదక్ జిల్లా చేగుంట (01), మేడ్చెల్ జిల్లా షామీర్ పేట్ (01) పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠా సభ్యులు (07) మందిని అదుపులోకి తీసుకున్నాము. ఐదుగురు నిందుతులను విచారించగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరానగర్ గ్రామానికి చెందిన పిట్ల ధనుష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన సత్తు వంశీ, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అక్కారం గ్రామానికి చెందిన దూదేకుల సల్మాన్, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరానగర్ గ్రామానికి చెందిన ఒంక మహిపాల్. వీళ్ళు ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు  ఒకరికొకరు పరిచయమైనారు.సత్తు వంశీ అనే వ్యక్తికి తల్లిదండ్రులు లేనందున ఒక్కడే గజ్వేల్ లో ఒక రూమ్ కిరాయికి తీసుకొని ఉండగా వీరు ఐదుగురు అతని రూమ్ కి వెళ్లి మద్యం తాగుతుండేవారు.
  • వీరు వేరు వేరు పనులు చేసినప్పటికీ రాత్రి అందరు రూమ్ లో కి వచ్చి మద్యం తాగి అక్కడే పడుకునేవారు. వీరు పని చేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోనందున ఏదైనా దొంగతనం చేసి జల్సాలు చేయాలనీ రహదారుల ప్రక్కన గల గ్రామాలను మరియు చుట్టుప్రక్కల గ్రామలను ఎంచుకొని వారి మూడు బైక్ ల పై వెళ్లి రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్ మోటార్ కేబుల్ వైర్ లను కటింగ్ ప్లేయర్ సహాయముతో కట్ చేసి అక్కడే నిర్మానుష్య ప్రదేశంలో వైర్ ని కాల్చి అందులో నుండి కాపర్ వైర్ తీసి వారికి తెలిసిన స్క్రాప్ షాప్ వాళ్లైనా కర్ణాటక రాష్ట్రం గురుమిట్కల్ జిల్లా యాదగిరి తాలూకా బద్దిపల్లి కి చెందిన ఇద్దరు వ్యక్తులు గణేష్ పల్లి దగ్గర స్క్రాప్ షాప్ మల్లేష్ (మల్లప్ప), ధర్మారెడ్డి పల్లి వద్ద స్క్రాప్ షాప్ నిర్వాహకుడు బీరప్ప, చిల్లప్ప యొక్క షాప్ లో విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండే వారు, అలా పలు చోట్ల దొంగతనాలకి పాల్పడుతున్నారు.
  • అదే క్రమంలో అయిదుగురు దొంగతనానికి వారి యొక్క ద్విచక్ర వాహనాల పై వెళ్తుండగా గుర్రలసోఫా వద్ద పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పెట్టుకొని చెక్ చేయగా బైక్ కవర్ లలో రెండు కటింగ్ ఫ్లైర్ లు దొరుకగా వారిని విచారించగా పోయిన సంవత్సరం నుండి మొన్నటి వరకి వరకు గ్రామా శివారులో ఉన్న వెళ్లి రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్ మోటార్ కేబుల్ వైర్ లను లక్ష్యంగా పెట్టుకుని అందులోని కాపర్ వైర్ లు వరుస దొంగతనాలకు పాల్పడినమని వారు దొంగలించి అమ్మిన కాపర్ వైర్, పోలిస్ వారు స్వాధీనముచేసుకున్నారని తాము చేసిన నేరాలు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ. 70 వేల విలువగల 90 కిలోల కాపర్ వైర్, 2 లక్షల 10 వేల విలువగల మూడు ద్విచక్ర వాహనాలు, మొత్తం 2లక్షల 80 వేల విలువగల వస్తువులను స్వాధీన పరుచుకోవడం జరిగిందన్నారు.
  • కాపర్ వైర్ కొనుగోలు చేసిన వారిలో చిల్లప్ప పరారీలో ఉన్నాడు. సిద్దిపేట కమిషనర్ ఎస్ ఎం విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇట్టి దొంగలను పట్టుకోవటానికి గజ్వేల్ ఏసిపి నర్సింలు, తొగుట సిఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ ఐ మానస లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించి వారు సేకరించి నసమాచారము మేరకు వడ్డేపల్లి గ్రామం శివారులోని గుర్రలసోఫా వద్ద వద్ద వాహన తనికీలు చేపట్టి నింధితులను పట్టుకున్నట్లు తెలిపినారు. ఈ కార్యక్రమంలో తొగట సిఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, ఏఎస్ఐ దేవయ్య, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య ఉదయ్ భాస్కర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -