నవతెలంగాణ -పెద్దవంగర
టీఎస్ యూటీఎఫ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఎర్ర వెంకన్న మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల సాధనలో టీఎస్ యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో డీటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి పోరాటాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రభాకర్, కార్యదర్శులు రాజు, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



