- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని పచ్చెదొడ్డి గ్రామ సమీపంలో గత ఏడాది అక్టోబరు 3న పులిని హత్య చేసి, పరారీలో ఉన్న ప్రముఖ నిందితుడు గోవింద అలియాస్ మరి వీరప్పన్ అలియాస్ జూనియర్ వీరప్పన్‌ను పోలీసులు, అటవీశాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. మైసూరులోని న్యాయస్థానం ముందు లొంగిపోయేందుకు వస్తున్నాడని తెలుసుకుని కాపుకాసిన అధికారులు, రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.
- Advertisement -



