- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం దాదాపు 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఈ గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా. పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి అక్రమ రవాణా పెరగడంతో, డీఆర్ఐ అధికారులు నిఘా పెంచారు.
- Advertisement -



