నవతెలంగాణ-హైదరాబాద్: చమురు నిల్వల కోసం వెనిజులాపై యూఎస్ ఆర్మీ దురాక్రమణకు పాల్పడిన విషయం తెలిసిందే. నికోలస్ మదురో తోపాటు ఆయన భార్యను నిర్భంధించిన ట్రంప్..గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునేందుకు కాసుల వర్షం కురింపించాలని చూస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తోంది.
ఓ పక్కా డెన్మార్క్ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతర చెప్తుతున్నా..డొనాల్డ్ ట్రంప్ తన పిచ్చి ప్రయత్నాలు ఆపడంలేదు.
57,000 మంది జనాభా కలిగిన ఈ ద్వీపాన్ని సొంతం చేసుకునేందుకు.. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరేలా అక్కడి ప్రజలను (Greenland Citizens) ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొంత డబ్బును కూడా ఆఫర్ చేసే యోచనలో ట్రంప్ టీమ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కొక్కరికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు ఇచ్చేందుకు యూఎస్ అధికారులు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.



