నవతెలంగాణ-పెద్దవూర
నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలపై విశాల ఐక్య ఉద్యమాలకు కార్మిక వర్గం రైతాంగం సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.శుక్రవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ప్రచార జీపు జాతను నారి ఐలయ్య జండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక చట్టాలను తెచ్చి దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు.కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్ని రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ లను తెచ్చి కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా వామపక్షాల మద్దతు తో 2005 లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో పేదలు పొట్టలు కొట్టే విధంగా విబిజి రాంజీ చట్టం తేవడం దుర్మార్గమైన చర్య అన్నారు.మోడీ సర్కార్ కనీస మద్దతు ధరల చట్టం చేయకపోగా విద్యుత్ సవరణ బిల్లు పేరుతో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేసి ప్రజల పై భారం పడేవిధంగా కొత్త చట్టం తెచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సహజ వనరులను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి విదానంగా మారిందని అన్నారు.ఈ విధానాల పైన పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రైతు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల దేశవ్యాప్త ప్రచార క్యాంపెయిన్ లో భాగంగా ఈనెల 8 నుండి 18 వరకు జీపు జాతల ద్వార గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. జనవరి 19న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇప్పుడు తెచ్చిన చట్టాల పైన నల్లగొండలో నిర్వహించే సభకు కార్మికులు రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదయ్య, సిఐటియు జిల్లా నాయకులు ఎస్కె బషీర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జటావత్ రవి నాయక్, ప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, నాయకులు దోరేపల్లి మల్లయ్య,గజ్జల కృష్ణారెడ్డి, దుబ్బ ఏడుకొండలు,తరి రామకృష్ణ, ప్రభాకర్, మద్దుమ్ మొహిద్దిన్,జానయ్యతదితరులు పాల్గొన్నారు.
మోడీ విధానాలపై ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



