- Advertisement -
నవతెలంగాణ -పరకాల
జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తక్షణమే జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఎస్పి జిల్లా ఇంచార్జ్ శనిగరపు రాజు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల పట్ల ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. అహంకార పూరిత వైఖరిని సహించేది లేదని, జర్నలిస్టులకు బీఎస్పీ అండగా ఉంటుందన్నారు.
- Advertisement -



