- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
గొర్రెలు , మేకలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని పశువైద్యాధికారి రవీందర్ అన్నారు. ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో శుక్రవారం రోజు గొర్రెలు, మేకలకు మాశూచి వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాల కార్యక్రమం నిర్వహించారు. పెంపకం దారులు తప్పని సారిగా గొర్రెలు, మేకలకు టీకాలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా టీకాల కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ గణపతి, ఉపసర్పంచ్ గోపాల్, నాయకులు లక్ష్మన్,దత్తు, శివ కూమార్, సంపత్ పటేల్,ప్రశాంత్,పిరాజి రాజు, గణపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



