Sunday, January 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఫ్యూచర్ పాఠశాల సంక్రాంతి సంబరాలు..

ఫ్యూచర్ పాఠశాల సంక్రాంతి సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో ఫ్యూచర్ కాన్సెప్ట్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రైతుల వేషధారణలో పిల్లలు సందడి చేశారు. హరిదాసు వేషధారణలో పిల్లలు ఆకట్టుకున్నారు. బొమ్మల కొలువు, వరిమడి, భోగీ మంటలు వేసి  విద్యార్థులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తారన్నారు. విధ్యార్థులకు పండుగ ప్రాధాన్యత తేలియజేయటం ఉద్దేశం అన్నారు. అందరికి ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -