Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్మద్నూర్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మద్నూర్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
శుక్రవారం సాయంత్రం నేషనల్ హైవే 161పై రోడ్డు ప్రమాదం జరిగింది. టీజీ ఈ 15 6539 నంబర్ గల కారు ఎంహెచ్ 26 బీజేడ్ 4088 గల బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని మద్నూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించామని ఎస్సై రాజు విలేకరులకు తెలిపారు. మృతుడి పేరు నారాయణ పవారే అని, మహారాష్ట్ర నాందేడ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -