నవతెలంగాణ – ఆలేరు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏ ఐ సీ సీ జనరల్ సెక్రటరీ కాంచీపురం మాజీ ఎంపీ విశ్వనాథన్ ప్రత్యేక పూజలు జరిపారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలయ పూజారులు శుక్రవారం ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వ విప్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ అనిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు కొండ్రజు వెంకటరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలయ పూజారులు పాల్గొన్నారు.
ఏఐసిసి జనరల్ సెక్రెటరీ విశ్వనాథన్ ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



