- Advertisement -
నవతెలంగాణ – మర్రిగూడ
మండలంలోని కుదాభక్షపల్లి గ్రామ శివారులో శుక్రవారం కొంతమంది బెట్టింగ్ పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు రైడ్ నిర్వహించి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి నుండి 14880 రూపాయల నగదు,4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
- Advertisement -



