- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఓ మహిళా ఐఏఎస్ పై వచ్చిన వార్తలను ఐపీఎస్ ల సంఘం ఖండించింది. కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన వార్తలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజాయతీగా పనిచేస్తున్న అధికారుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొంది. దురుద్దేశంతో మహిళా ఐఏఎస్ ను కించపరిచారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ల సంఘం స్పష్టం చేసింది. తప్పుడు వార్తలను అన్ని మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
- Advertisement -



