నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా లైఫ్ హాస్పిటల్ లో శుక్రవారం సాయంత్రం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు, సనాతన ధర్మ ప్రచారకులు శ్రీ మంగి రాములు మహ స్వామీ వారు హాజరయ్యారు. వారిని హస్పిటల్ యం.డి. డాక్టర్ భాను రామగిరి చైర్మన్ వేణు రామగిరి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. వారితోపాటు డివిజన్ ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పుర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కోటపాటి నరసింహం నాయుడు, సుంకరి రంగన్న, పోల్కం వేణు,మందుల బాలు, అమితాబ్ కిరాడ్, దాసరి సందీప్, ధర్మపురి, దీకొండ లక్ష్మణ్, రవినాధ్, బోయిల్ల రవి, మోహన్, రాచర్ల ధనంజయ్, శేఖర్ లోచర్, ప్రశాంత్ ఖాందేశ్, పసుల ముత్తేన్న, శ్రీధర్, రాచర్ల శ్రీనివాస్, సంజీవ్, మాదవరెడ్డి, లైఫ్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లైఫ్ హాస్పిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


