Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ కోర్టులో న్యాయవాదులుగా ఉండి కక్షిదారులకు న్యాయాన్ని అందిస్తూ ప్రజలకు సైతం, గ్రామాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో గ్రామ ఎన్నికలలో పోటీ చేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి శనివారం పట్టణ కోటియందు సన్మానించినారు. తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్ కు, చేపూర్ ఉపసర్పంచ్ సిందూక చరణ్ కు (వీరు గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేయడమైనది), అంక్సాపూర్ వార్డ్ మెంబర్ బుట్టి మధుకు (వీరు ప్రస్తుతం హ్యాట్రిక్ అంటే మూడుసార్లు వార్డ్ మెంబర్ గా ఎన్నుకోబడ్డారు. వీరు గతంలో ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేయడమైనది.) 

వీరికి బార్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించడమే కాకుండా గ్రామాభివృద్ధికై , ప్రజల సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తూ వారికి శాలువాలతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో  బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, మాజీ బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు కృష్ణ పండిత్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగారం, కోశాధికారి చైతన్య , న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -