Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పై ఫిర్యాదు

ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పై ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు పిఎంశ్రీ నిధులను దుర్వినియోగం చేశాడంటూ ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్, ఐత బాపు లు శుక్రవారం తెలంగాణ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ కు హైదరాబాద్ లో రాతపూర్వకంగా పిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పిఎంశ్రీ నిధుల (2024-2025) సంవత్సరానికి రూ.21 లక్షలు దుర్వినియోగం పై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లుగా తెలిపారు.

పేద పిల్లల కోసం మంజూరు చెసిన నిధులను తన సొంత ఖాతాలో వేసుకుని దుర్వినియోగ పరిచినట్లుగా తెలిసిందన్నారు. తూతుమంత్రంగా పనులు చేపట్టి ఆడిట్లో తప్పుడు బిల్లులు సమర్పించినట్లుగా తెలిసిందని, ఈ సంఘటనపై మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు విన్నవిస్తే పట్టించుకోలేదన్నారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క స్కావెంజర్ తో పనులు చేయించి, ఇద్దరు స్కావెంజర్ల వేతనాలను మంజూరు చేయించి ఒక్కరి వేతనం ఇచ్చి మరొక్క స్కావెంజర్ వేతనాన్ని నెలకు రూ.6 వేల చొప్పున 10 నెలల వేతనాన్ని స్వాహా చేసినట్లుగా ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -