– నియోజకవర్గం వ్యాప్తంగా 120 మందికి లబ్ధి
– మరో రెండు నెలలే గడువు
– ఏడీఏ పెంటేల రవికుమార్ వెల్లడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయంలో సాంకేతికత, యాంత్రీకరణ పథకాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం అశ్వారావుపేట లో నిర్వహించిన రైతు మేళాలో అధికారికంగా ప్రారంభించడంతో సాగులో యాంత్రీకరణ పథకం పునఃప్రారంభమైందని ఏడీఏ (అగ్రికల్చర్ డివిజన్ అధికారి) పెంటేల రవికుమార్ శనివారం తెలిపారు.
ఈ ఏడాది యాంత్రీకరణ పథకానికి తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి రూ. 1 కోటి 27 లక్షలు నిధులు కేటాయించిందని తెలిపారు. ఐదు మండలాల నుంచి ఇప్పటివరకు 120 మంది రైతులకు రూ. 25 లక్షల విలువైన యంత్ర పరికరాలను అందించినట్లు చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 – 26) ముగిసేందుకు మరో రెండు నెలల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, అవసరమైన యంత్ర పరికరాల కోసం ఔత్సాహిక రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివరాలకు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
మండలాల వారీగా లబ్ధి వివరాలు
మండలం లబ్ధిదారులు రాయితీ (రూ. లక్షల్లో)
అశ్వారావుపేట 17 3.10
దమ్మపేట 18 2.82
ములకలపల్లి 45 8.80
అన్నపురెడ్డిపల్లి 22 6.20
చండ్రుగొండ 18 4.14
మొత్తం 120 25.08
గడువు సమీపంలో ఉన్నందున అర్హత కలిగిన రైతులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆయ సూచించారు.



