సినిమా, సృజనాత్మకత, శక్తివంతమైన కథనాలకు సంబంధించిన రెండు రోజుల ఉత్సాహ భరితమైన వేడుకకు నాంది పలుకుతూ హైదరాబాద్‌లోని రాజ్ భవన్ సంస్పృతి ఆడిటోరియంలో ‘నిరి9’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ మూడవ ఎడిషన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అధికారిక సావనీర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కె.వెంకట్ రెడ్డి వీడియో సందేశం ద్వారా విడుదల చేశారు. రెండు రోజుల పాటు, హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, షార్టర్ ఫిల్మ్, డాక్యుమెంటరీతో సహా బహుళ విభాగాలలో ఎంపిక చేయబడిన చిత్రాలు పోటీపడతాయి. మొదటి రోజు, 2వ రోజు అధికారికంగా ఎంపిక చేయబడిన ‘దహిని, జుయిఫూల్, కుహిపత్, ఘర్, ధోంగులోయి, ది ఎలిఫెంట్ హెవెన్, గోల్డెన్థ్రెడ్, పాపా, చోరి, ఇలిష్, అబాసేషాట్, మనితాశుభవం, క్యారెక్టర్, బియాండ్ ది అన్‌ఫినిష్డ్, ది అగ్లీ గ్రీన్ ప్లానెట్, ఓమ్నిప్రెజెంట్, శేష్ చితి, పా’ పోటీ విభాగంలో, విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కూకీ’, ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్ణ వంటి సినిమాల వరుస ప్రదర్శనలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిచ్చేలా నగదు అవార్డులను అందించే 15 చలనచిత్రోత్సవాలలో ఈ ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవంలో రూ. 4,30,000 నగదు బహుమతులు, ప్రత్యేక గుర్తింపు, వ్యక్తిగత అవార్డులతో పాటు ప్రదానం చేస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ జుబీన్గార్గ్ స్మారక అవార్డును ఈ ఉత్సవంలో అత్యుత్తమ చలన చిత్రానికి ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో నటి సీమా బిశ్వాస్, దర్శకుడు ఎస్.వి.కష్ణారెడ్డి, గాయని లౌ మాజా, నటి కార్లిటామౌహిని, గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ బోర్తాకూర్, టీఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.ఎల్.ఆర్.కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
శక్తివంతమైన కథలకు వేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



