కోల్‌కతా : ఐప్యాక్‌పై ఈడీ దాడులపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని పిటిషన్లో కోరింది. కోట్లాది రూపాయి బొగ్గు స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈడీ దాడులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ నిబంధనలు అతిక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు సోదాలు చేపడుతుండగా.. మమతా బెనర్జీ ఐప్యాక్ కార్యాలయంలోకి ప్రవేశించి డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు సహా కీలక ఆధారాలను తీసుకువెళ్లినట్టు ఈడీ ఆరోపించింది. మమతా బెనర్జీపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ప్రతీక్ జైన్ నివాసంపై జరిగిన దాడిలో పోలీసుల సాయంతో ఆమె ఈడీ కస్టడీ నుండి నేరారోపణ పత్రాలను తీసుకువెళ్లారని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై మమతా బెనర్జీ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.



