Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంరూర్కెలాలో కూలిన ప్రయివేట్‌ విమానం

రూర్కెలాలో కూలిన ప్రయివేట్‌ విమానం

- Advertisement -

– ఆరుగురికి గాయాలు
– పంటపొలాల్లో దిగిన విమానం
భువనేశ్వర్‌ :
ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం శనివారం రూర్కెలా సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలైనట్టు ఒడిశా వాణిజ్య, రవాణా మంత్రి బి.బి.జెనా తెలిపారు. ఒన్‌ ఎ-1 విమానం ఆరుగురు ప్రయాణికులతో రూర్కెలా నుంచి భువనేశ్వర్‌ వెళుతోంది. టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తడంతో రూర్కెలాకి 10కి.మీ దూరంలోని జలధలోని పంటపొలాల్లో విమానం కుప్పకూలింది. విమానంలో ఇద్దరు సిబ్బంది సహా నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురికి స్వల్ప గాయాలైనట్టు మంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజన్‌ విఫలమైందని అన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -