– నలుగురు మృతి
హర్యానా : పంజాబ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషియార్పూర్ – దాసుయ రోడ్డుపై వెళుతున్న పంజాబ్ రోడ్‌వేస్ బస్సును కారు ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురవడంతో.. దృశ్యమానత తగ్గడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు తెలిపారు. మరణించినవారు సుఖ్విందర్, సుశీల్‌కుమార్, బ్రిజ్ కుమార్, అరుణ్‌కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా హిమాచల్‌ప్రదేవ్‌లోని చాలెట్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు ధృవీకరించారు. అదే గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హోషియార్పూర్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేరారు.కాగా, ఈ ప్రమాదం గురించి హరియాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సబ్ ఇన్పెక్టర్ కిరణ్‌సింగ్ మాట్లాడుతూ.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అమృత్‌సర్ విమానాశ్రయానికి వెళుతున్నారు. వీరంతా కారులో దోసర్క సమీపానికి రాగానే కారు నడుపుతున్న డ్రైవర్‌కి పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న బస్సు కనపడలేదు. దీంతో కారు బస్సును ఢీకొట్టినట్లు కిరణ్‌సింగ్ తెలిపారు.
పంజాబ్ లో బస్సును ఢీకొన్న కారు
- Advertisement -
- Advertisement -



