Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులు పిరం

వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులు పిరం

- Advertisement -

2805 డాలర్ల నుంచి 2,965లకు పెంచిన అమెరికా
భారత విద్యార్థులు, వృత్తి నిపుణులపై భారం


వాషింగ్టన్‌: హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను అమెరికా పెంచింది 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్‌ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. ఈమేరకు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఓ ప్రకటనను విడుదల చేసింది. జూన్‌ 2023 నుంచి జూన్‌ 2025 మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్టు వెల్లడించింది.

వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్‌ చేయడానికి ఈ అదనపు రుసుమును వసూలు చేస్తారు. హెచ్‌-1బీ, ఎల్‌-1,ఒ-1,పీ-1, టీఎన్‌ వీసాల (ఫారం క్ష్మీ-129) విషయంలో ప్రీమియం ఫీజు వి2,805 నుంచి వి2,965కు పెరగనుంది. ఎఫ్‌-1, జే-1 వంటి వీసాల (ఫారం 1-539) విషయంలో ఫీజును వి1,965 నుంచి వి2,075కు పెంచింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్‌ సర్వీసులు అందించడానికి ఉపయోగిస్తామని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. ఇతర దేశాలతో పాటు భారత్‌కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఈ ఫీజు ప్రభావం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -