Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంరేపు నింగిలోకి 'అన్వేష్‌ ఉపగ్రహం

రేపు నింగిలోకి ‘అన్వేష్‌ ఉపగ్రహం

- Advertisement -

– పిఎస్‌ఎల్‌విబిసి 62 ప్రయోగానికి సర్వం సిద్ధం
– నేడు కౌంట్‌ డౌన్‌
సూళ్లూరుపేట :
గత నెల డిసెంబర్‌లో ఎల్‌విఎం3బిఎం6 భారీ ప్రయోగం విజయం తర్వాత మరో విజయానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పిఎస్‌ఎల్‌విబిసి 62 రాకెట్‌ ద్వారా జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు అన్వేష్‌ (ఇఒఎస్‌బిఎన్‌1) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. దీంతో పాటు మరో 15 వాణిజ్య ప్రయోగాలను ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 10గంటల 17 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది 24 గంటల పాటు కొనసాగిన అనంతరం సోమవారం పిఎస్‌ఎల్‌వి బిసి 62 రాకెట్‌ నింగిలోకి ప్రయోగిస్తారు. శ్రీహరికోటలోని ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనం (పిఐఎఫ్‌)లో రాకెట్‌ అనుసంధానం కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ ప్రయోగంలో 1,485 కేజీల బరువు ఉన్న అన్వేష్‌ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది అత్యంత కీలకమైన ఉపగ్రహం. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేసే భూ పరిశీలన ఉపగ్రహాలను అనేకం ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. భూ పరిశీలన చేసిన తర్వాత సమాచారాన్ని భూమికి చేరవేసే ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ ఉపగ్రహానికి అన్వేష్‌ అనే నామకరణం చేశారు. ఈ ఉపగ్రహం సైనిక అవసరాల నిఘా నిమిత్తం భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సమాచారాన్ని భూతలంలోని కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేస్తుంది. ఈ ప్రయోగంలో స్పానిష్‌కు చెందిన స్టార్టప్‌ ఆర్బిటల్‌ పారడైజ్‌ భాగస్వామ్యంతో నిర్మించిన 25 కేజీల బరువు గల క్రిస్టల్‌ ఇనిషియల్‌ డెమానిస్ట్రేటర్‌ (కెఐడి) క్యాప్సూల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.

శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి-సి62 రాకెట్‌ ద్వారా గగనతలంలోకి పంపనున్న ఇఒఎస్‌-ఎన్‌1 విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో రాకెట్‌ నమూనాలకు, ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌, శాస్త్రవేత్తలకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్‌ను పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి ప్రయోగమని, పిఎస్‌ఎల్‌వి సి 62 రాకెట్‌ ద్వారా భూ పరిశీలన కోసం ఇఒఎస్‌-చీ1 ఉపగ్రహంతో పాటూ వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మైక్రో శాటిలైట్‌లను కూడా ప్రయోగిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం శ్రీచెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -