Monday, January 12, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయంపై రైతులకు అవగాహన

వ్యవసాయంపై రైతులకు అవగాహన

- Advertisement -

రావినూతలకు రూ. 10 లక్షల విలువ చేసే వాటర్ ప్లాంట్ మంజూరు
గ్రోమోర్ కోరమాండల్ జోనల్ మేనేజర్ అనుగు సుమన్ రెడ్డి
600 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు 
విజయవంతంగా ముగిసిన ఉచిత కంటి వైద్య శిబిరం
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోనే బోనకల్ మండల పరిధిలోని రావినూతల ఉన్నత పాఠశాలలో  గ్రోమోర్ కోరమాండల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 600 మంది రోగులు హాజరయ్యారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు పంపిణీ చేయనున్నారు. రావినూతల గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారులు అమరజీవి చన్న లక్ష్మీనరసింహారావు కుమారులు చన్నా సంపత్ కుమార్, చన్న సుధీర్ కుమార్ కృషి మేరకు గ్రోమోర్ కోరమాండల్ వారు రావినూతల గ్రామాన్ని గ్రోమోర్ కోరమండల్ గ్రామం గా ఎంపిక చేశారు. అందులో భాగంగా గ్రోమోర్ కోరమండల్ ఆధ్వర్యంలో విజయవాడ కు చెందిన కంటి వైద్య నిపుణులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చన్న సుధీర్ కుమార్ అధ్యక్షన ఏర్పాటుచేసిన సభలో గ్రోమోర్ కోరమండల్ జోనల్ ఆఫీసర్ అనుగు సుమన్ రెడ్డి మాట్లాడుతూ సుధీర్ కుమార్, సంపత్ కుమార్ కృషి మేరకే తాము రావినూతల గ్రామాన్ని గ్రోమోర్ కోరమండల్ గ్రామముగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రోమోర్ కోరమాండల్ గ్రామముగా ఎంపిక చేసిన గ్రామానికి తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ సీజన్ సమయంలో రైతులకు అవసరమైన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

రంగంలో వస్తున్న మార్పులకు తమ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు పెట్టి చైతన్యం చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే రావినూతల గ్రామానికి రూ. 10 లక్షల విలువచేసే వాటర్ ప్లాంట్ ని మంజూరు చేసినట్లు తెలిపారు. వాటర్ ప్లాంట్ కోసం స్థలం కావాలని సర్పంచ్ బుక్య బద్రు నాయక్, ఉపసర్పంచ్ దొండపాటి సత్యనారాయణ ను అడిగిన వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా తమకు స్థలాన్ని చూపించి స్థలాన్ని కూడా తమకు అప్పగించారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

సుధీర్ కుమార్, సంపత్ కుమార్ రావినూతల గ్రామాన్ని ఎంపిక కోసం చేసిన కృషి అమోఘం అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తామని అది రావినూతల గ్రామం ఎంపిక కావటానికి వారిద్దరే కారణమన్నారు.  గ్రోమోర్ కోరమాండల్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంపత్ కుమార్, సుధీర్ కుమార్ మాట్లాడుతూ తమశక్తి మేరకు గ్రామ అభివృద్ధికి పాటుపడతామన్నారు. గ్రామ ప్రజల కోసం గ్రోమోర్ కోరమాండల్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. భుక్యా బద్రు నాయక్, దొండపాటి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రోమోర్ కోరమాండల్ వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధి విషయంలో తమకు రాజకీయాలు లేవన్నారు. తమ గ్రామాభివృద్ధిలో గ్రోమోర్ కోరమాండల్ పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అనంతరం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.600 మందికి కంటి వైద్య పరీక్షల నిర్వహించారు. కళ్ళజోళ్ళు అవసరమైన వారికి పది రోజులలో నాణ్యమైన కళ్ళజోళ్ళు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రోమోర్ కోరమాండల్ మార్కెటింగ్ ఆఫీసర్ పప్పుల ఫణి రామ్ కుమార్, ఆగ్రోస్ మిస్ట్ లు పొడిసెట్టి నిఖిలేశ్వర్, దూదిమెట్ల మధుసూదన్ రావు, గుత్తా నాగేశ్వరరావు, వైద్యులు రేట్ల శ్రీలక్ష్మి, యండమూరి శివ, సిబ్బంది గూడాబత్తిని స్టాలిన్, మెరుగు మహేష్, బి చిట్టిబాబు, దొప్పిసాని కృష్ణ, మాచర్ల రుచిత, దొరడ్ల సుందర్, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సభ్యులు జోనిబోయిన గురవయ్య, మాజీ సర్పంచ్ గుగులోత్ పంతు,మాజీ సొసైటీ అధ్యక్షులు మైనేని నారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -